పార్టీలు కాదు.. అభివృద్ధే ముఖ్యం | Minister Dr. lakshmareddy commented on government | Sakshi
Sakshi News home page

పార్టీలు కాదు.. అభివృద్ధే ముఖ్యం

Apr 11 2016 2:02 AM | Updated on Aug 14 2018 10:54 AM

పార్టీలు కాదు.. అభివృద్ధే ముఖ్యం - Sakshi

పార్టీలు కాదు.. అభివృద్ధే ముఖ్యం

ఏ పార్టీలో ఉన్నామన్నదికాదు అభివృద్ధి ఎంత చేశామన్నదే ముఖ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ....

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి

బాలానగర్ : ఏ పార్టీలో ఉన్నామన్నదికాదు అభివృద్ధి ఎంత చేశామన్నదే ముఖ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నందారం గ్రామ శివారులోని గుట్టపై నూతనంగా నిర్మాణం చేసిన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. వేదపండితులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అక్కడ జరుగుతున్న హోమంలో పాల్గొన్న మంత్రి అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామస్తులందరు కలిసికట్టుగా ఆలయాన్ని నిర్మించుకున్నట్లే గ్రామాభివృద్ధికి పార్టీలు పక్కన పెట్టి కలిసి రావాలన్నారు.

తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటర్‌గ్రీడ్ పథకాన్ని అమల్లోకి తెచ్చారని, రాబోయో రోజుల్లో మహిళలు బిందెలు పట్టుకుని బయటికి వెళ్లాల్సిన అవసరముండదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ హరిత, వైస్ ఎంపీపీ లింగ్యానాయక్, నాయకులు వెంకట్‌చారి, కర్ణంశ్రీను, జగన్‌నాయక్, వెంకటయ్య, వాల్యానాయక్, శ్రీశైలం యాదవ్, నర్సింలు, బచ్చిరెడ్డి పాల్గొన్నారు.


దుర్గామాతకు మంత్రి లక్ష్మారెడ్డి పూజలు
జడ్చర్ల టౌన్ : పెద్ద ఆదిరాల గ్రామపంచాయతీ పరిధిలోని వాయిలగడ్డ తండాలో ఆదివారం దుర్గామాత, సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ధ్వజారోహణం, విగ్రహా ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ట కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి. ల క్ష్మారెడ్డి పాల్గొని దుర్గామాతకు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం గిరిజనులు దుర్గామాత, సేవాలాల్ నామస్మరణాన్ని జపించారు. గిరిజనుల గురువు బోజ్యనాయక్ ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో ఎంపీపీ  లక్ష్మిశంకర్‌నాయక్, జెడ్పీటీసీ జయప్రద, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్, నాయకులు శ్రీకాంత్, శ్రీను, రవి, వీరస్వామి, శ్రీను  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement