గెలిచే దమ్ము లేక... | Marri Sasidhar Reddy takes on kcr govt | Sakshi
Sakshi News home page

గెలిచే దమ్ము లేక...

Aug 21 2015 2:13 PM | Updated on Aug 29 2018 8:20 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో మర్రి శశిధర్రెడ్డి మాట్లాడుతూ ... గెలిచే దమ్ము లేక ఒక్క సనత్నగర్లో 54 శాతం ఓట్లు తొలగించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నిక సంఘం దృష్టికి తీసుకువెళ్తానని మర్రి శశిధర్రెడ్డి స్పష్టం చేశారు. ఈ కుట్రపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.

 

రాష్ట్ర గవర్నర్ టీఆర్ఎస్ కార్యకర్తలా మాట్లాడుతున్నారని శశిధర్ రెడ్డి విమర్శించారు. సనత్ నగర్లో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఈ విషయంలో కూడా గవర్నర్ నరసింహన్ టీఆర్ఎస్ సభ్యుడిలా మాట్లాడుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement