సరిహద్దుల్లో మావోయిస్టుల పేలుళ్లు

Maoists Attack In Chhattisgarh Border - Sakshi

ఒక జవాను, ఇద్దరు పౌరులకు గాయాలు

సాక్షి, కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు మళ్లీ విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలోని బాసగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీ మందుపాతర పేల్చారు. సీఆర్‌పీఎఫ్‌ 168 బెటాలియన్‌కు చెందిన జవాన్లు కూంబింగ్‌ కు వెళ్తుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది. దీంతో జవాన్‌ మన్నాకుమార్‌ మౌర్యకు గాయాలయ్యాయి. వెంటనే ఇతడిని బీజాపూర్‌ జిల్లా కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే.. దంతెవాడ జిల్లాలోని బార్సూర్‌–నారాయణపూర్‌ మార్గంలోని పుస్పాల్‌ వద్ద మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌బాంబు శుక్రవారం పేలింది. పోలీసులే లక్ష్యంగా ఈ బాంబును మావోయిస్టులు అమర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని దంతెవాడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top