భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పోస్టర్ల కలకలం రేగింది.
చర్లలో మావోయిస్టు పోస్టర్ల కలకలం
Jun 23 2017 11:51 AM | Updated on Oct 8 2018 8:37 PM
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పోస్టర్ల కలకలం రేగింది. జిల్లాలోని చర్ల మండల పరిషత్తు కార్యాలయం వద్ద మావోయిస్టు పార్టీ చర్ల, శబరీ ఏరియా కమిటీ పేరుతో పోస్టుర్లు వెలిసాయి. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా మారితే కఠిన చర్యలు తప్పవని.
పోడు భూముల జోలికి వస్తే వదిలేది లేదని.. నకలీ విత్తనాలతో అమాయకులను మోసం చేయాలని చూస్తే ఇబ్బందులు తప్పవని.. నాణ్యమైన విత్తనాలనే సరఫరా చేయాలని వ్యాపారులను హెచ్చరించారు.
Advertisement
Advertisement