ముత్తారం: ఎంతటి అపాయాన్ని అయినా చిన్నపాటి ఉపాయంతో తొలగించుకోవచ్చునని, ఉపాయం ఉంటే ఊళ్లు ఏలచ్చని కవులు చెప్పినట్లు..విద్యుత్ స్తంభాలు ఎక్కే క్రమంలో జరిగే అపాయాలను చిరు ఉపాయంతో తప్పిస్తున్నాడు తాత్కాలిక విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్న వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే రామగిరి మండలం నాగేపల్లి గ్రామ పంచాయతీ విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తున్న కుమార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటి వరకు నిచ్చెన ఉపయోగించేవాడు. విద్యుత్ స్తంభం పై భాగానికి వెళ్లాలంటే కాళ్లతోనే ఎక్కాల్సిన పరిస్థితి.
దీంతో పలుమార్లు జారిపడి ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి. ప్రమాదాల నివారణ కోసం దీర్ఘంగా ఆలోచన చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభం దొడ్డుకు సరిపడా ఇనుప రాడ్లతో క్లిప్స్ తయారు చేయించి, వాటిని చెప్పులకు బిగించాడు. కాళ్లకు చెప్పులు తొడుక్కొని ఇనుప రాడ్లు, క్లిప్పుల మధ్య విద్యుత్ స్తంభం ఉండడం వల్ల జారిపోకుండా ఉండి సునాయసంగా స్తంభాన్ని ఎక్కుస్తున్నాడు. ఉపాయం చిన్నదే అయిన్పటికీ ఎన్నో అపాయాల నుంచి కాపాడుతోందని కుమార్ చెప్తున్నాడు. కుమార్ పనితనాన్ని అందరూ శభాష్ అంటూ అభినందిస్తున్నారు.
చిరు ఉపాయం.. తొలగిస్తుంది అపాయం
Mar 27 2018 11:41 AM | Updated on Mar 27 2018 11:41 AM
Advertisement
Advertisement