గొర్రెలు చనిపోయాయని ఐపీ పెట్టిన వ్యక్తి | The Man who IPs that the Sheep are Dead | Sakshi
Sakshi News home page

రూ.12 లక్షలకు ఐపీ దాఖలు 

Jul 20 2019 8:39 AM | Updated on Jul 20 2019 8:39 AM

The Man who IPs that the Sheep are Dead - Sakshi

ఖమ్మంలీగల్‌: ఖమ్మంఅర్బన్‌ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన పేరం వెంకటరమణ శుక్రవారం ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో రూ.12.80 లక్షలకు దివాలా పిటిషన్‌ దాఖలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఫిర్యా ది తన గ్రామంలో గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ గొర్రెలకు కొన్ని రోజుల తర్వాత జబ్బు వచ్చి చనిపోయాయి. ఈ గొర్రెలను అధిక రేటుకు కొనుగోలు చేశాడు. ఈ గొర్రెలను కొనుగోలు చేయడానికి బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని కొనుగోలు చేశాడు. ఈ గొర్రెలు చనిపోవడంతో అప్పులు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మొత్తం 16 మందిని ప్రతివాదులుగా చూసిస్తూ రూ.12.80లక్షలకు ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో తన న్యాయవాది బీశ రమేష్, జి.వీరభద్రం ద్వారా దివాలా పిటిషన్‌ దాఖలు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement