ప్రాణం మీదికి తెచ్చిన జూదం | man died in KPHB Colony | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదికి తెచ్చిన జూదం

Mar 3 2017 1:11 AM | Updated on Sep 5 2017 5:01 AM

జూదమాడుతూ పోలీసుల కంటబడటంతో తప్పించుకోబోయి బాల్కనీ నుంచి ఇద్దరు వ్యక్తులు జారి పడ్డారు.

హైదరాబాద్‌: జూదమాడుతూ పోలీసుల కంటబడటంతో తప్పించుకోబోయి బాల్కనీ నుంచి ఇద్దరు వ్యక్తులు జారి పడ్డారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ ఎంఐజీ బస్‌స్టాప్‌ సమీపంలోని ఓ భవనం రెండో అంతస్తులో బుధవారం అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు జూదమాడుతున్నారు. శబ్దాలు రావడంతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు ఆ ఫ్లాట్‌కు వెళ్లి తలుపు తట్టారు. దీంతో ఒక వ్యక్తి డోర్‌ తీయగా, పేక ముక్కలు తీసివేసి అందరూ నిలబడ్డారు.

అర్ధరాత్రి ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా భయాందోళనకు గురైన శ్రీనివాస్‌ (36), పి.శ్రీను(40)లు వెనుక వైపున్న బాల్కనీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీరిద్దరూ జారి కింద పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన వారిని సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీనివాస్‌ మృతి చెందాడు. కాగా, మరో నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న రూ.1,200 లను సీజ్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కుషాల్కర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement