బైక్ ను ఆటో ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు
మంచిర్యాల : బైక్ ను ఆటో ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పొన్నారం గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్(19) బైక్‌పై వెళుతుండగా అదే మండలానికి చెందిన గుడిపేట గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
కాగా ఈ ఘటనలో దివ్య అనే యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దివ్యను ఆస్పత్రికి తరలించారు.