బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన వలసకార్మికుడు విగతజీవిగా మారాడు.
చందుర్తి : బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన వలసకార్మికుడు విగతజీవిగా మారాడు. కంపెనీ సరిగా జీతం ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన పొక్కిలి శంకర్ (32) రూ.1.20 లక్షల వరకు అప్పు చేసి ఐదేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు.అప్పటి నుంచి కంపెనీ సరిగా జీతం ఇవ్వడం లేదు. బలవంతంగా పని చేరుుంచుకుంటోంది. దీంతో మనస్తాపం చెందిన శంకర్ గురువారం తా ను పనిచేస్తున్న చోటే బంగ్లాపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయూన్ని తోటి కార్మికులు ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు తెలిపారు.