కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఓ యువకుడిని కొంతమంది వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు.
కొండాపూర్ (మెదక్ జిల్లా) : కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగా ఓ యువకుడిని కొంతమంది వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. వివరాల ప్రకారం.. కొండాపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన సువర్ణ(45) అనే మహిళతో కొంతకాలంగా సుధాకర్(27) అనే యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం తెలిసిన సువర్ణ భర్త ప్రభాకర్ పలుమార్లు సుధాకర్‌ను హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో సుధాకర్‌ను గ్రామానికి పిలిపించి చెట్టుకు కట్టేసి ప్రభాకర్, అతని బంధువులు చితకబాదారు. తీవ్రగాయాలకు సుధాకర్ మరణించడంతో వారు పరారయ్యారు. సుధాకర్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.