రయ్‌.. రయ్‌

Madhapur Metro Station Services Starts From Today - Sakshi

అందుబాటులోకి మాదాపూర్‌ మెట్రో స్టేషన్‌

నేటి నుంచి సేవలు ప్రారంభం

సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌ మెట్రో స్టేషన్‌ శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి శుక్రవారం తెలిపారు. మే నెలాఖరులోగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌ కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని, అప్పటిలోగా హైటెక్‌ సిటీ వద్ద మెట్రోరైలు రివర్సల్‌ పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ – హైటెక్‌ సిటీ మార్గంలో రివర్సల్‌ సదుపాయం లేకపోవడంతో ట్విన్‌సింగిల్‌ లైన్‌లోనే మెట్రో రైళ్లు ప్రయాణిస్తున్న విషయం విదితమే. రివరల్స్‌ సదుపాయం ఏర్పాటు చేసిన అనంతరం హైటెక్‌ సిటీకి వెళ్లే మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం నాగోల్‌ – హైటెక్‌ సిటీ,ఎల్బీనగర్‌ – మియాపూర్‌ మార్గంలోనిత్యం 2.30 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తున్నారని వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top