ప్రేమజంట ఆత్మహత్య | lovers commits suicide in warangal district | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Apr 14 2016 8:43 AM | Updated on Nov 6 2018 7:56 PM

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం కోగిల్వాయి గ్రామంలో గురువారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది.

ఆత్మకూరు: వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం కోగిల్వాయి గ్రామంలో గురువారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నన్నబోయిన రమ(18), జంగిలి గణేశ్(20) అనే యువతీయువకులు గ్రామశివారులో ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. యువతీయువకుల కులాల వేరుకావడంతో పెద్దలు వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు.

ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే కారణంతోనే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. స్థానికులు గుర్తించి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారమందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement