ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం | Lover Boy Cheated Girl Protest In Front Of House | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం

Jun 19 2019 8:13 AM | Updated on Jun 19 2019 8:13 AM

Lover Boy Cheated Girl Protest In Front Of House - Sakshi

ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటం చేస్తున్న మౌనిక  

బెజ్జూర్‌(సిర్పూర్‌): ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది.. వివరాల్లోకి వెళ్తే బెజ్జూర్‌ మండలం బారేగూడె గ్రామానికి చెందిన మౌనిక  అదే గ్రామానికి చెందిన చిప్ప రమేష్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో తనను పెండ్లి చేసుకోవాలని మౌనిక కోరడంతో నిరాకరించాడు. కోరిక తీరక తనను మోసం చేశాడని మౌనిక మంగళవారం ప్రియుడి ఇంటిముందు మౌనపోరాటానికి దిగింది.

గత 15 రోజుల క్రితం కులపెద్దలు, గ్రామస్తులతో పంచాయతీ నిర్వహించగా  పెండ్లి చేసుకుంటానని రమేష్‌  అంగీకరించాడని, తల్లి మాటలు విని గ్రామం నుంచి ఏటో వెళ్ళాడని పేర్కొంది. రమేష్‌ వచ్చి తనను పెండ్లి చేసుకునేంతవరకు మౌనపోరాటం విరమించేది లేదని పేర్కొంది. గ్రామస్తులు కొంతమంది ఆమెకు మద్దతు తెలిపారు. ఈ విషయంపై బెజ్జూర్‌ పోలీసులను వివరణ కోరగా రమేశ్‌పై లికితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement