మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది.
	సాక్షి, హైదరాబాద్: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు.  
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
