పట్టపగలే.. చెరువుపై వేలమంది విరుచుకుపడ్డారు!!

Local Villagers Looted Fish Tank in Suryapet - Sakshi

సూర్యాపేటలో చేపల చెరువును కొల్లగొట్టిన స్థానికులు

లబోదిబోమంటున్న మత్స్యకారులు.. చోద్యం చూసిన పోలీసులు

సాక్షి, సూర్యాపేట : జిల్లాలో  చేపల చెరువు లూటీకి గురయింది. సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే చేపలను స్థానికులు దోచేశారు. ఏకంగా వేలమంది చెరువుపై దాడికి పాల్పడ్డారు. చేపల కోసం ఎగబడి.. దోచుకున్నారు. పోలీసుల కళ్ళ ముందే ఈ దోపిడీ జరిగింది.

ఇక్కడ ఈ ఫొటోలో చెరువులో దిగిన వారంతా పుణ్య స్నానాల కోసం వచ్చిన భక్తులు కాదు. పుణ్యానికి (ఉచితంగా) వచ్చిన చేపలను కాజేయడానికి వచ్చిన చోర్‌ బ్యాచ్ ఇదంతా. మునగాల మండలం గణపవరం చెరువు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. రెండేళ్లుగా మత్స్యకారుల కుటుంబాలు ఈ చెరువులో చేపలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ చెరువులో భారీగా చేపలు ఉన్నాయని, అవి స్థానికంగా దొంగతనానికి గురవుతున్నాయని ఆ నోటా ఈ నోటా తెలుసున్న సుమారు 10 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా చెరువుపై విరుచుకుపడ్డారు. అప్పనంగా విలువైన చేపలు దొరుకుతుండటంతో.. ఏమాత్రం జంకు-బొంకు లేకుండా చెరువును లూటీ చేసేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top