అమ్మకాలు తగ్గినా..ఆదాయం ఘనమే..! | liquor sales are decreased | Sakshi
Sakshi News home page

అమ్మకాలు తగ్గినా..ఆదాయం ఘనమే..!

Jun 19 2014 4:24 AM | Updated on Sep 27 2018 4:42 PM

అమ్మకాలు తగ్గినా..ఆదాయం ఘనమే..! - Sakshi

అమ్మకాలు తగ్గినా..ఆదాయం ఘనమే..!

జిల్లాలో ఈ ఏడాది మద్యం విక్రయాలు భారీగా తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం గతేడాది కంటే ఎక్కువ గానే ఉంది. గతం కంటే ఈ ఏడాది మద్యం రేట్లు భారీగా పెరగడంతోనే ఆదాయం అధికంగా వచ్చింది.

 ఆదిలాబాద్ : జిల్లాలో ఈ ఏడాది మద్యం విక్రయాలు భారీగా తగ్గినప్పటికీ ఆదాయం మాత్రం గతేడాది కంటే ఎక్కువ గానే ఉంది. గతం కంటే ఈ ఏడాది మద్యం రేట్లు భారీగా పెరగడంతోనే ఆదాయం అధికంగా వచ్చింది. అయితే ఆబ్కారీ శాఖ అంచనాలు మాత్రం తలకిందులయ్యాయి. అనుకున్నదొకటైతే.. అయింది మరొకటన్నట్లు విక్రయాలు తగ్గినా ఆదాయం గ తేడాదిని మించి రావడంతో కొంత ఊరట చెందారు.
 
తగ్గిన విక్రయాలు
ఎక్సైజ్ శాఖ పరంగా ప్రతి ఏడాది జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు వార్షిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈనెల చివరితో 2013-14 మద్యం వార్షిక సం వత్సరం ముగియనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మద్యం దుకాణాల కోసం టెండర్లను ఆహ్వానించింది. జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రారంభం కానుంది. కాగా 2012-13, 2013- 14లో విక్రయాలను గమనిస్తే... 2012-13లో ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) 11,64,600 కేసులు, 12,62,083 బీర్ కేసులు విక్రయించారు.
 
 దాని ద్వారా రూ.476.46 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి లభించింది. 2013-14లో ఐఎంఎల్ 10,91,208 కేసులు, బీర్ 11,39,046 కేసులు విక్రయించగా ప్రభుత్వానికి రూ. 494.45 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ లెక్కన గతేడాది, ఈ ఏడాది విక్రయాలను పరిశీలిస్తే ఐఎంఎల్ కేసులు 73, 392, బీర్ 1,23,037 కేసులు తక్కువగా అమ్ముడుపోయాయి. అయితే ఈ ఏడాది రెండు మూడు రేట్లు మద్యం ధరలను పెంచడంతో ఆదాయం మాత్రం గత ఏడాదిని మించి లభించింది. గతేడాది కంటే ఈ ఏడాది రూ.17.99 కోట్లు అధికంగా సమకూరింది.
 
 ఎన్నికల ఏడాదైనా తక్కువే...
2013-14లో ఎన్నికలనామ సంవత్సరంగా మిగిలినా ఎక్సైజ్ శాఖకు మాత్రం ఆదాయంపరంగా మొండిచేయే ఎదురైంది. ఎన్నికల వేళ మద్యం విక్రయాలు పెరగాల్సింది పోయి తగ్గుముఖం పట్టాయి. ఈ తిరోగమనం ఆబ్కారీ శాఖకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాదిలో సహకార, పంచాయతీ, మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల సంగ్రామం నడిచింది. అయితే ఎన్నికల కమిషన్ నిబంధనలు మద్యం విక్రయాలకు ప్రతిబంధకంగా మారాయి. ఆ నెలలో గతేడాది అదే నెలలో అమ్మిన విలువను మించరాదని నిబంధన ఉండడం దీనికి కారణమైంది. దీనికి తోడు మహారాష్ట్ర నుంచి దేశీదారు అక్రమ రవాణా రాష్ట్ర ఆదాయాన్ని కొల్లగొట్టింది. దీంతో ఎక్సైజ్ శాఖకు ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement