సారిక చితికి నిప్పంటించిన తల్లి


-వరంగల్‌లోనే రాజయ్య కోడలు, మనువళ్లు అంత్యక్రియలు

-అంత్యక్రియలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు

-భారీగా తరలివచ్చిన మహిళలు, స్థానికులు

-రాజయ్యకు వ్యతిరేకంగా నినాదాలు
పోచమ్మమైదాన్ : వరంగల్ నగరంలోని పోతన స్మశాన వాటికలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనువళ్లు అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతన స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆస్పత్రి నుంచి స్మశానవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి... కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్యను సస్పెండ్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. మానవత్వం కలిగిన వారందరూ ఆ నలుగురుకి ఆత్మ బంధువులు అయ్యారు. కుతురు సారికకు తల కొరివి పెట్టేందుకు కుండ పట్టుకుని అంతమయాత్రలో తల్లి లలిత సాగుతుంటే అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు.సాయంత్రం సారిక చితికి తల్లి లలిత నిప్పు అంటించారు. తరువాత అభినవ్, శ్రీయాన్, అయాన్ మతదేహాలను ఖననం చేశారు. మనువళ్లను ఖననం చేశాకా లలిత బిగ్గరగా రోధిస్తూ కుప్పకూలిపోయింది. అత్యక్రియలలో సారిక సోదరి అర్చన, కుటుంబ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్రోజు బిక్షపతి, సోల్లేటి కష్ణమాచార్యులు, కట్ట ఈశ్వరాచారి, చిట్టిమల్ల రమేశ్ బాబు, కలకోట భాస్కరచారి, గన్నోజు జగన్, కర్ణకంటి కమార్, కొక్కోండ రవి, శ్రీరాముల సతీష్, బెజ్జంకి విశ్వనాథం, సత్యనారాయణ, బండ్ల సురేందర్, మహిళా సంఘం నాయకురాలు ఇందిర పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్ద సారిక తల్లిని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కష్ణమాదిగ పరామర్శించారు. సారిక మతిపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top