పాతబస్తీలో ప్రారంభమైన బోనాల జాతర

Lal Darwaza Simhavahini Mahankali Bonalu Festival In Old City - Sakshi

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి మినీ జాతర

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి మినీ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అయిదు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా బోనాలకు ముందు వచ్చే శుక్రవారాన్ని మినీ జాతరగా పిలుస్తారు.

పాతబస్తీలో మొదలైన సందడి
మరోవైపు పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీఎచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ కలశ స్థాపన ద్వారా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ రూ. 25 కోట్లు కేటాయించింది. బోనాలు జరిగే ఆలయాల వద్ద శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top