'60 ఏళ్ల యువకుడు కేసీఆర్' | ktr statement on trs president kcr | Sakshi
Sakshi News home page

'60 ఏళ్ల యువకుడు కేసీఆర్'

Apr 21 2015 10:01 AM | Updated on Aug 15 2018 9:27 PM

'60 ఏళ్ల యువకుడు కేసీఆర్' - Sakshi

'60 ఏళ్ల యువకుడు కేసీఆర్'

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 60 ఏళ్ల వయసులో కూడా యువకుడిగా పని చేస్తున్నారని పంచాయతీరాజ్ మంత్రి తారక రామారావు అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 60 ఏళ్ల వయసులో కూడా యువకుడిగా పని చేస్తున్నారని పంచాయతీరాజ్ మంత్రి తారక రామారావు అన్నారు.  టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్ గురించి కేటీఆర్ 'సాక్షి' మీడియాతో మంగళవారం మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోనే తామందరూ పని చేస్తున్నామని, అధ్యక్ష పదవికి ఆయనే సమర్థుడని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.


టీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించే సత్తా కేసీఆర్కు ఉందని కేటీఆర్ అన్నారు.  కేసీఆర్ ఇప్పటికే వర్కింగ్లో ఉన్నారని.. ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు అవసరం లేదని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లో  అన్ని అంశాలపై చర్చ జరుగుతుందని సాక్షితో కేటీఆర్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement