గ్రీన్ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ను ప్రారంభించనున్న కేటీఆర్‌

KTR To Inaugurate Green Industrial Park - Sakshi

సాక్షి, భువనగిరి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రీయల్‌ పార్క్ శుక్రవారం తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులో సుమారు 438 ఎకరాల్లో 1500 కోట్ల వ్యయంతో ఇండస్ట్రీయలైజేషన్‌ జరిగింది.  పార్కు నిర్మాణంతో.. పరిసర గ్రామాల్లోని సుమారు 30 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలపడంతో.. ప్రారంభోత్సవం కోసం అక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గ్రీన్ ఇండస్ట్రీయల్‌ పార్క్ ప్రారంభోత్సవం రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నేపథ్యంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి నేడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top