కేసీఆర్ గారడీ చేస్తున్నారు: కిషన్‌రెడ్డి | kishan reddy fire on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ గారడీ చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

Sep 11 2014 12:59 AM | Updated on Mar 29 2019 9:24 PM

కేసీఆర్ గారడీ చేస్తున్నారు: కిషన్‌రెడ్డి - Sakshi

కేసీఆర్ గారడీ చేస్తున్నారు: కిషన్‌రెడ్డి

‘ఏ ప్రభుత్వం పనితీరునైనా 100 రోజుల పాల నతో అంచనా వేయటం న్యాయం కాకపోవచ్చు.

హైదరాబాద్: ‘ఏ ప్రభుత్వం పనితీరునైనా 100 రోజుల పాల నతో అంచనా వేయటం న్యాయం కాకపోవచ్చు. కానీ ఐదేళ్ల పాలనకు సంబంధించి ప్రణాళిక, ఎన్నికల హామీల అమలుకు కార్యాచరణ రూపొందించి ప్రజలకు సంకేతం పంపటానికి మాత్రం కచ్చితంగా సరిపోతుంది. ఈ దిశలో ప్రజలను కేసీఆర్ నిరాశపరిచారు. బియ్యం గిన్నె పొయ్యిమీద పెట్టకముందే.. పరమాన్నం వడ్డించిన భ్రాంతి కలిగించి గారడీ చేస్తున్నారు’ అని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్ ఉప ఎన్నిక ప్రచారానికి ఒక్కరోజు గడువు మాత్రమే మిగిలిఉన్న తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు సుదీర్ఘమైన ఐదు పేజీల బహిరంగలేఖ  రాశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాన్ని విడుదల చేశారు. 

లేఖలోని విమర్శలు కిషన్‌రెడ్డి మాటల్లోనే... ‘మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో రుణమాఫీకి అడ్డంకులు లేవు. కానీ ఖరీఫ్ సీజన్ దాటుతున్నా దాని అర్హుల జాబితా పేరుతో అనవసర కాలయాపన చేస్తున్నారు. ఇచ్చే ఉద్దేశం లేకనే ఇలా చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఈ వంద రోజుల్లో ఎలాంటి కదలిక లేదు. ఫీజులు చెల్లించలేని లక్షన్నర మంది పేద విద్యార్థులు కౌన్సిలింగ్ నుంచి వైదొలిగారు. కరెంటు అడిగినందుకు రైతులను రక్తంచిందేలా లాఠీలతో కొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement