'కేంద్రం వద్ద అటువంటి ప్రతిపాదనేది లేదు'

Kishan Reddy Comments About Hyderabad As Second Capital City To India In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తామనే అంశం మీద కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని క్రేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చామని, త్వరలోనే దానిని పూర్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఆలోచన లేదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్య అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను రాష్ట ప్రభుత్వమే పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులకు సంబంధించిన పంపకాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని కిషన్‌రెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top