వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌ ఖమ్మం | khammam team wins telangana weight lifting championship | Sakshi
Sakshi News home page

వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌ ఖమ్మం

Feb 27 2017 10:16 AM | Updated on Sep 5 2017 4:46 AM

తెలంగాణ రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ను ఖమ్మం జిల్లా క్రీడాకారులు సాధించారు.

► వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు

డోర్నకల్‌ :  తెలంగాణ రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్‌ మెన్, ఉమెన్‌ చాంపియన్‌ షిప్‌ను ఖమ్మం జిల్లా క్రీడాకారులు సాధించారు. ఆదివారం వీర్‌ వ్యాయామశాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల బహుమతి ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. మహబూబాబాద్‌ డీఎస్పీ రాజమహేంద్రనాయక్‌ విజేతలకు బహుమతులను అందజేశారు. పురుషుల, మహిళల చాంపియన్‌షిప్‌ను వేర్వేరుగా ఖమ్మం జట్టు, రన్నర్స్‌గా భద్రాద్రి కొత్తగూడెం జట్టు సాధించాయి.

వ్యక్తిగత విభాగంలో 50 కేజీల కేటగిరిలో మొదటి మూడు స్థానాల్లో ఎస్‌.లక్ష్మణ్‌ (ఖమ్మం), 56 కేజీల విభాగంలో వి.సంతోష్‌కుమార్‌ (ఖమ్మం), బి.హన్మంతరావు (నిజామాబాద్‌), అజయ్‌ప్రసాద్‌ పాశి (కొత్తగూడెం), 62 కేజీల విభాగంలో వి.ఉదయ్‌సందీప్‌ (ఖమ్మం), ఎం .దత్తురాజ్‌ (నిజామాబాద్‌), ఆర్‌.సునీల్‌ (కొత్తగూడెం), 69 కేజీల విభాగంలో బి.నరేష్‌ (ఖమ్మం), కె.నవీన్‌ (కొత్తగూడెం), పి.అనురుధ్‌ (నిజామాబాద్‌), 77 కేజీల విభాగంలో జి.యశ్వంత్‌ (ఖమ్మం), వై.రాహుల్‌ (వరంగల్‌), సీహెచ్‌.సాయికృçష్ణ (కొత్తగూడెం), 85 కేజీల విభాగంలో సయ్యద్‌ అబ్దుల్లా (వరంగల్‌), జి.చంద్రశేఖర్‌ (ఖమ్మం), ఎం మోహన్‌రావు (వరంగల్‌), 94 కేజీల విభాగంలో కె.హరితేజ (ఖమ్మం), ఎస్‌.హిమసాగర్‌ (దిలాబాద్‌), ఎస్‌ శ్రీనివాసరావు  (వరంగల్‌) 105 కేజీల విభాగంలో డి.ఆదిగణేష్‌ (కరీంనగర్‌), వై.కేశవ లక్ష్మివరప్రసాద్‌ (ఖమ్మం), 105పైన విభాగంలో కె.తరుణ్‌తేజ (ఖమ్మం) నిలిచారు. మహిళల విభాగంలో 44 కేజీల కేటగిరిలో ఎం.అనూష (ఖమ్మం), బి.శ్వేత (కొత్తగూడెం), 48 కేజీల కేటగిరిలో ఎస్‌కె ఆసియా (ఖమ్మం), సీహెచ్‌.హిమబిందు (ఖమ్మం), జె.సుచిత్ర (ఖమ్మం), 58 కేజీల విభాగంలో బి.సంధ్యారాణి (ఖమ్మం), కె.సౌమ్య (కొత్తగూడెం), 63 కేజీల విభాగంలో జి.మౌనిక (వరంగల్‌), సీహెచ్‌ దివ్యశ్రీ (ఖమ్మం) నిలిచారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement