సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

Khammam Man Selfie Video Blaming Debts In Business - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అప్పుల బాధ తాళలేక ప్రాణాలు తీసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో ఓ వ్యాపారి చెప్పాడు. ఎవరెవరికి ఎంత బాకీ చెల్లించాల్సి ఉందో చీటిలో రాసిపెట్టానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారి రాయపాటి నరసింహన్‌ తెలిపారు. నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు వ్యక్తుల మోసం వల్లే తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించాడు. లిస్టులో ఉన్నవారందరికీ ఇప్పటికే రెండింతల వడ్డీలు కట్టానని తెలిపాడు. ఇంటికొస్తున్నానని చెప్పి మోసం చేసినందుకు క్షమించాలని కోరాడు. ఇంటికి తిరిగి రావాలని అనుకున్నా.. తనవల్ల కావడం లేదని పేర్కొన్నాడు. ఇక ఆలస్యం చేయడం తనవల్ల కావడం లేదని, తనకు చావే శరణ్యమని రోదించాడు. కాగా, తన భర్త ఐదు రోజులుగా కనిపించడం లేదని నరసింహన్‌ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top