
బాలుడిని భద్రాచలంకు తరలిస్తున్న దృశ్యం
సాక్షి, చర్ల(ఖమ్మం) : స్థానిక విజయకాలనీకి చెందిన ఓ చిన్నారి ఆడుకుంటుండగా కరెంట్ బల్బు పేలి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. విజయకాలనీకి చెందిన పలకా రమేష్–పుష్పావతిల కుమారుడు శ్రీనివాస్ ఉదయం ఆరుబయట పిల్లలతో ఆడుకుంటూ..తీసేసిన బల్బు, హోల్డర్‌తో కూడిన వైర్లు దొరకగా సరదాగా తీసుకువచ్చి ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్‌బోర్డులో పెట్టాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బల్బు పేలిపోయి..ఆ గాజు ముక్కలు చిన్నారి చేతులకు, ముఖానికి తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు బాలుడిని తొలుత చర్లలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం భద్రాచలం తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.