సీఎం సతీమణికి అస్వస్థత | KCR Wife Shobha Hospitalized | Sakshi
Sakshi News home page

సీఎం సతీమణికి అస్వస్థత

Feb 23 2018 2:47 AM | Updated on Sep 4 2018 5:07 PM

KCR Wife Shobha Hospitalized - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు సతీమణి శోభ

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఆమెను చికిత్స కోసం యశోద ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. డాక్టర్‌ పీవీ రావు ఆమెకు వైద్యసేవలు అందిస్తున్నారు. కేసీఆర్‌ గురువారం ఆస్పత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శుక్రవారం ఉదయం డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement