నేడు జోడేఘాట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ | kcr moves to Jodeghat today | Sakshi
Sakshi News home page

నేడు జోడేఘాట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్

Oct 8 2014 2:21 AM | Updated on Aug 15 2018 9:22 PM

నేడు జోడేఘాట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ - Sakshi

నేడు జోడేఘాట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీంకు ఘన నివాళులర్పించేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌కు వస్తున్నారు.

కొమురం భీం వర్ధంతిలో పాల్గొననున్న సీఎం
 
 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీంకు ఘన నివాళులర్పించేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌కు వస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి రావడంపై ఆదివాసీల్లో హర్షం వ్యక్తమవుతోంది. సీఎం రాకకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, కలెక్టర్ ఎం.జగన్మోహన్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్ వారం రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జోడేఘాట్ అత్యంత మారుమూల అటవీ ప్రాంతం కావడం, మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం కావడంతో పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు పక్షం రోజులుగా ఈ అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మరోవైపు తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు కూడా సంసిద్ధంగా ఉన్నాయి.
 
 హెలీకాప్టర్ ట్రయల్న్
 
 కెరమెరి : కొమురం భీమ్ వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో మంగళవారం జోడేఘాట్‌లో హెలీకాప్టర్ ట్రయల్ రన్ చేసింది. మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా జోడేఘాట్ అడవుల్లో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ స్థలంలో దిగిన ఈ హెలీకాప్టర్ సిగ్నల్స్ సరిగా లేక సుమారు గంటసేపు అక్కడే ఉండిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement