
బాధల తెలంగాణగా మార్చేశారు: పొన్నాల
బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బాధల తెలంగాణగా మార్చారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు.
బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బాధల తెలంగాణగా మార్చారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను కాంగ్రెస్ నేతలు అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. వ్యవసాయానికి కనీస విద్యుత్ కూడా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోజులో కనీసం ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు కొత్త రుణాలు కూడా మంజూరు చేయాలన్నారు.