నంబర్ ప్లేట్స్ వివాదానికి తెరదించిన కేసీఆర్! | KCR clears Number plates issue | Sakshi
Sakshi News home page

నంబర్ ప్లేట్స్ వివాదానికి తెరదించిన కేసీఆర్!

Jun 12 2014 5:21 PM | Updated on Aug 15 2018 9:20 PM

నంబర్ ప్లేట్స్ వివాదానికి తెరదించిన కేసీఆర్! - Sakshi

నంబర్ ప్లేట్స్ వివాదానికి తెరదించిన కేసీఆర్!

తెలంగాణలో మోటార్ వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు వివాదానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెరదించారు

హైదరాబాద్:  తెలంగాణలో మోటార్ వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు వివాదానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు తెరదించారు. వాహన నంబర్ ప్లేట్ల అంశంపై రవాణాశాఖ ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 
 
తెలంగాణలో వాహనాల నంబర్లు నంబర్ ప్లేట్లు మార్చాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. AP స్థానంలో TSగా మార్చుకుంటే సరిపోతుందని కేసీఆర్ తెలిపారు. 
వాహనాల నంబర్లు పాతవే ఉంటాయని, జిల్లా కోడ్‌ మాత్రమే మారుతుందని కేసీఆర్ అన్నారు. 
 
వాహనాల నెంబర్ ప్లేట్లపై రవాణాశాఖ మంత్రికి సరిగ్గా వివరించలేకపోవడంవల్లే సమస్య వచ్చిందని సమీక్షా సమావేశంలో అధికారులతో కేసీఆర్ అన్నట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement