మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు: సీఎం కేసీఆర్‌

KCR Announced 5Lakhs Compensation Devipatnam Boat Capsize Victims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల వద్ద జరిగిన లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల్లో తెలంగాణవాసులు ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  

పడవ ప్రమాదంపై గవర్నర్‌ విచారం 
సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదిలో పడవ ప్రమాదంపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

సాగర్‌–శ్రీశైలం బోటు టూరు రద్దు 
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదిలో నాగార్జున సాగర్‌–శ్రీశైలం మధ్య నిర్వహించే బోటు టూర్‌ ను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రస్తుతం కృష్ణానదిలో నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తేసిన సంగతి తెలిసిందే. దీంతో నీటి ప్రవాహ వేగం పెరగటంతో శని,ఆదివారాల్లో నిర్వహించే బోటు టూర్‌ను రద్దు చేసుకుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top