లండన్‌లోని తెలంగాణ విద్యార్థులకు కవిత సాయం | Kavitha Helped Telangana Students In London | Sakshi
Sakshi News home page

లండన్‌లోని తెలంగాణ విద్యార్థులకు కవిత సాయం

Apr 24 2020 3:11 AM | Updated on Apr 24 2020 3:11 AM

Kavitha Helped Telangana Students In London - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా లండన్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులకు మాజీ ఎంపీ కల్వకుం ట్ల కవిత బాసటగా నిలిచా రు. నిజామాబాద్, కరీంనగ ర్, వరంగల్‌ జిల్లాలకు చెందిన ఆరుగురు విద్యార్థు లు ఈ ఏడాది జనవరిలో మాంచెస్టర్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ లాంక్‌షైర్‌లో ఎంబీఏ కోర్సులో చేరారు. లాక్‌డౌన్‌తో విమానాలు రద్దు కావడంతో వారు అక్కడే చిక్కుకుపోగా, అక్కడి ప్రభుత్వపరంగా కూడా వారికి ఎలాంటి సాయమూ అందలేదు. దీంతో వారు తమ పరిస్థితిని వివరిస్తూ సాయం చేయాలని ట్విట్టర్‌ ద్వారా మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న కవిత.. వారిని ఆదుకోవాలని తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు సుమన్‌ బల్మూరిని ఆదేశించారు. ఆ విద్యార్థులను సంప్రదించిన సుమన్‌.. వారికి 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. బ్రిటన్‌లో పరిస్థితులు చక్కబడేవరకూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement