
రాయికల్(జగిత్యాల): జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్‌కు చెందిన అయిత భూమయ్య(43) దుబాయ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమయ్య పదిహేనేళ్లుగా దుబాయ్‌లోని ఏరిటిగా కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కంపెనీ వేతనం చెల్లించడం లేదు.
స్వగ్రామానికి వెళతానని పాస్‌పోర్టు ఇవ్వాలని పలుమార్లు కంపెనీ యాజమాన్యాన్ని వేడుకున్నా స్పందించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భూమయ్య ఈనెల 10న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.