దత్తత గ్రామాల్లో కాళోజీ వర్సిటీ సేవలు | Kaloji University service in adopted villages | Sakshi
Sakshi News home page

దత్తత గ్రామాల్లో కాళోజీ వర్సిటీ సేవలు

Apr 24 2016 4:46 PM | Updated on Jul 26 2019 5:58 PM

దత్తత గ్రామాల్లో కాళోజీ వర్సిటీ సేవలు - Sakshi

దత్తత గ్రామాల్లో కాళోజీ వర్సిటీ సేవలు

వరంగల్ జిల్లాలో తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ సేవలను ప్రారంభించింది.

ఏటూరు నాగారం : వరంగల్ జిల్లాలో తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ సేవలను ప్రారంభించింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న గొత్తికోయ గూడేలు లింగాపురం, రాయిబందం, చిన్మలమర్రిలో 600 కుటుంబాలకు ఆదివారం వస్త్రాలు పంపిణీ చేశారు.

కాళోజీ వర్సిటీ వీసీ బి.కరుణాకర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న రెండు మూడేళ్లలో ఈ గూడేలలో కనీస అవసరాలకు ఇబ్బంది రాకుండా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధబోయిన నాగార్జున, ఎంపీపీ మహీరున్నీసా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement