13 వేల కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు | kalesvaram reservoirs With 13 billion | Sakshi
Sakshi News home page

13 వేల కోట్లతో కాళేశ్వరం రిజర్వాయర్లు

Oct 24 2016 1:37 AM | Updated on Oct 30 2018 7:50 PM

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్ల టెండర్ల ప్రక్రియకు రంగం సిద్ధమైంది.

సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్ల టెండర్ల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రూ.13 వేల కోట్లతో ఐదు రిజర్వాయర్ల నిర్మాణాలకు వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు అధికారులు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే సిద్ధమైన రిజర్వాయర్ల అంచనాల తుది పరిశీలన శరవేగంగా సాగుతోంది.

ఇది పూర్తయితే ప్రభుత్వం రిజర్వాయర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇవ్వనుంది. ఈ ప్రక్రియంతా వారం, పది రోజుల్లో పూర్తి చేసి వచ్చే నెలలో టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. ఈ రిజర్వాయర్లలో మల్లన్నసాగర్(తడ్కపల్లి)కే గరిష్టంగా రూ.9,300 కోట్లు వ్యయం అవుతుందని తేల్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement