చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది | Jungle Cat Hulchal In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది

Nov 27 2019 6:48 PM | Updated on Nov 27 2019 7:40 PM

Jungle Cat Hulchal In Shamshabad Airport - Sakshi

అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి అడవి పిల్లి ముచ్చెమటలు పట్టించింది. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఏరో టవర్స్‌ సమీపంలో ఓ జంతువు తిరగడం గమనించారు. దానిని చిరుతగా భావించిన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలో కి దిగిన అటవీ శాఖ సిబ్బంది.. మూడు గంటలపాటు శ్రమించి దానిని బంధించారు. అయితే  అది చిరుత కాదని.. అడవి పిల్ల అని తేల్చారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement