డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులో వ్యక్తికి 20 రోజుల జైలు

Judge suspends licence after cought in drunk driving for 3rd time - Sakshi

సాక్షి, సూరారం(హైదరాబాద్‌) : డ్రంకన్‌ డ్రైవ్‌లో మూడవ సారి పట్టుబడిన వ్యక్తికి 20 రోజుల జైలు శిక్షతోపాటూ లైసెన్స్‌ రద్దు చేస్తు మేడ్చల్‌ కోర్టు తీర్పునిచ్చింది. కుత్బుల్లాపూర్‌ గాంధీనగర్‌కు చెందిన లాల్‌మహ్మద్‌ బుధవారం రాత్రి నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. గతంలో రెండు సార్లు ఇదే తరహాలో దొరకడంతో గురువారం ట్రాఫిక్‌ పోలీసులు అతన్ని మేడ్చల్‌ కోర్టులో హాజరు పరిచారు. మూడుసార్లు డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడడంతో ఆగ్రహించిన జడ్జి అతని డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దుతో పాటు 20 రోజుల జైలు శిక్ష విధించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top