జనశక్తి నక్సల్స్ అరెస్ట్ | janashakti naxals arresed in nizamabad | Sakshi
Sakshi News home page

జనశక్తి నక్సల్స్ అరెస్ట్

Mar 27 2015 12:21 PM | Updated on Sep 2 2017 11:28 PM

నిజామాబాద్ జిల్లా పోలీసులు శుక్రవారం జనశక్తి గ్రూప్ నక్సల్స్‌ను ఐదుగురిని అరెస్టు చేశారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీసులు శుక్రవారం జనశక్తి గ్రూప్ నక్సల్స్‌ను ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తపంచాలు, ఒక రివాల్వర్, కొన్ని డిటొనేటర్లు, బుల్లెట్లు, విప్లవసాహిత్యం, బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో వేంపటి కుమార్ అలియాస్ గంగన్న అలియాస్ జీవన్, ఏదులకంటి లింగారెడ్డి అలియాస్ శ్యాం, జంగలం శంకర్, చండ్రుపట్ల సురేష్, అక్కల రాజు ఉన్నారు. అలాగే, వీరికి ఆశ్రయం కల్పించిన నేరంపై మరో ఐదుగురిని బైండోవర్ చేశారు. అంతేకాకుండా జనశక్తి గ్రూపుకు చెందిన కూర రాజన్న, దేవేందర్, విమలక్క తదితర నేతలపై కుట్ర కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విలేకరులకు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement