కేసీఆర్‌ది దురహంకారం | janareddy fire to kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది దురహంకారం

May 12 2014 1:14 AM | Updated on Mar 18 2019 9:02 PM

కేసీఆర్‌ది దురహంకారం - Sakshi

కేసీఆర్‌ది దురహంకారం

తాను ఓడిపోతానని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దురహంకారంగా మాట్లాడుతున్నాడని, ఆయనలా దిగజారి మాట్లాడలేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆయనలా దిగజారి మాట్లాడలేను: జానారెడ్డి

 మిర్యాలగూడ  : తాను ఓడిపోతానని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు దురహంకారంగా మాట్లాడుతున్నాడని, ఆయనలా దిగజారి మాట్లాడలేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ని స్థానాలు గెలుస్తామనే లెక్కలు మాత్రం చెప్పనని, కానీ, అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. తమకంటే అధిక సీట్లు వస్తాయని ఎవరికి వారుగా ప్రకటించుకుంటున్నారే తప్ప.. ఎన్ని సీట్లు వస్తాయని ఎవరూ చెప్పలేరన్నారు. ప్రజా తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందనీ, అధిష్టానం నిర్ణయంతోనే ముఖ్యమంత్రి నియామకం జరుగుతుందని స్పష్టంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement