ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం

Jagadish Reddy At The Ceremony Of Bouddha Sangiti - Sakshi

బౌద్ధ సంగీతి–2019 ముగింపు కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. బుద్ధిజం మొదలైన కాలానికీ ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో రెండ్రోజులుగా జరుగుతున్న బుద్ధ సంగీతి–2019 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడారు.  బుద్ధిజానికి, తెలంగాణకు మొదటి నుంచి ఉన్న సారూప్యా న్ని వివరించారు. తెలంగాణ సమాజపు ఆలోచనలు బుద్ధిజానికి ప్రతీకలని ఆయన అభివర్ణించారు. బుద్ధిజానికి ఆనవాళ్లు గా నిలిచిన సూర్యాపేట జిల్లాలోని 5 ఆరామాలను కాపాడుకుంటామన్నారు. ఫణిగిరి, వర్ధమానకోట, నాగారం, తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బుద్ధిజానికి తెలంగాణ ప్రతీకలనేందుకు తార్కా ణాల న్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే జి.కిషోర్‌ కుమార్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్‌ లింబాద్రి, థాయిలాండ్, నేపాల్, భూటాన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top