రామన్న రాక కోసం..

IT Minister KTR Visiting Warangal On October 5th - Sakshi

సాక్షి , వరంగల్‌ : జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభం, శంకుస్థాపనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం జిల్లాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వచ్చే 5వ తేదీన రానున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓసారి కేటీఆర్‌ జిల్లాలో పర్యటించారు. అయితే, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు కేటీఆర్‌ రానున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలకడంతో పాటు పలు అభివృద్ది పథకాలకు ప్రారంభం, శంకుస్థాపనలు జరిపిం చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

పక్కాగా ఉండాలి...
మంత్రి కేటీఆర్‌ వచ్చే నెల 5వ తేదీన జిల్లాకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీ, గ్రామీ ణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంతి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన అత్యవసరంగా బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రభు త్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్, ఎంపీ బండా ప్రకాశ్, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జె.పాటిల్, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డితో మంత్రి చర్చిం చారు.

జిల్లా అభివృద్ధికి దిక్సూచిగా నిలిచే పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాంపూర్‌లో ‘కుడా’ ఆక్సీజన్‌ పార్కు, శిల్పారామం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనులు, భద్రకాళి బండ్‌ పనులు, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు, స్మార్ట్‌ సిటీ రోడ్లు, నగర ప్రవేశ తోరణాలు, ట్రేడ్‌ ఫేర్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు, సైనిక్‌ స్కూల్, రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీ అంశాలపై చర్చించారు. మంత్రి పర్యటన సందర్భంగా భద్రకాళి బండ్‌ పనులు పూర్తిచేయించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రధాన పనులను ఉన్న ఆటంకాలను తొలగిచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు.

ఇదిలా ఉండగా మంత్రి ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి సమీపంలో ఐటీ పార్కు ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసే అవకాశం ఉందని సమాచారం. వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై కూడా కేటీఆర్‌తో జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించే అవకాశం ఉంది. కాగా, కేటీఆర్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈ సమావేశంలో అధికారులకు సూచించారు. ఇక 28న ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాల ప్రారంభం వేడుకలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో గ్రేటర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రవికిరణ్, ‘కుడా’ ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డి, సీపీఓ జెడ్‌.రాందాస్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, ప్రజా రోగ్యం, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top