గురునానక్‌ విద్యాసంస్థలపై ఐటీ దాడులు | IT attacks on Gurunanak educational institutions | Sakshi
Sakshi News home page

గురునానక్‌ విద్యాసంస్థలపై ఐటీ దాడులు

Nov 23 2017 1:16 AM | Updated on Sep 27 2018 4:02 PM

IT attacks on Gurunanak educational institutions - Sakshi

ఇబ్రహీంపట్నం: గురునానక్‌ విద్యాసంస్థలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి సోదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్న గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాల క్యాంపస్‌లోని కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు సోదాలను చేశారు. ఐటీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో మీడియా ప్రతినిధులు క్యాం పస్‌లోకి వెళ్లేందుకు కళాశాల సిబ్బంది, అధికారులు నిరాకరించారు.

ఇబ్రహీంపట్నం లోని కళాశాలనే కాకుండా హైదరాబాద్‌ చైతన్యపురిలోని డెంటల్‌ కళాశాలపై ఏకకాలంలో దాడులు చేసినట్లు సమాచారం. అక్రమంగా డబ్బులు కూడబెట్టినట్లు సమా చారం రావడంతో అధికారులు ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సుమారు 8 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కళాశాలలోని రికార్డులను అధికారులు పరిశీలించగా పలు లొసుగులున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

దీనిపై వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు యత్నించినా యాజమాన్యం మాట్లాడేందుకు ముందుకు రాలేదు. గురునానక్‌ ఎడ్యు కేషన్‌ సొసైటీ పేరుతో విద్యాసంస్థలను నడిపిస్తూ.. దీని ద్వారా వచ్చిన డబ్బులను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి మళ్లించి అక్రమంగా డబ్బులను కూడబెట్టుకున్నట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement