మతపరమైన రిజర్వేషన్ల నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలో ధర్నా చేపట్టారు.
మతపరమైన రిజర్వేషన్లు తగదు: బీజేపీ ధర్నా
Mar 17 2017 1:27 PM | Updated on Mar 29 2019 9:31 PM
హన్మకొండ: మతపరమైన రిజర్వేషన్ల నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలో ధర్నా చేపట్టారు. ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని తలకెత్తుకుందని విమర్శించారు. ఇప్పటికే 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను కోర్టు కొట్టివేసిందని, ఇపుడు 12 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు.
ఏకశిలా పార్కు నుంచి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాలో పార్టీ అర్బన్ శాఖ అధ్యక్షురాలు రావు పద్మ,, అమరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరావులు, మార్తినేని ధర్మారావు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు.
Advertisement
Advertisement