‘ఇరిగేషన్’లోనే ‘మిషన్ కాకతీయ’ పైలాన్

‘ఇరిగేషన్’లోనే ‘మిషన్ కాకతీయ’ పైలాన్ - Sakshi


{Xన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్

50 అడుగుల ఎత్తుతో నిర్మాణం

కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరణ


 

చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయం ఆవరణలో నిర్మించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పచ్చజెండా ఊపారు.. 50 అడుగుల ఎత్తుతో కాకతీయుల సంస్కృతిని ప్రతిబింబించేలా.. పైలాన్ పై భాగంలో రెండు చేతులు అభ్యర్థిస్తున్నట్లుగా పై నుంచి నీటి చుక్క పడే విధంగా నిర్మించాలని ఆదేశించారు.

  - వరంగల్ రూరల్   - వివరాలు 2లో..

 

 ‘ఇరిగేషన్’లోనే ‘మిషన్ కాకతీయ’ పైలాన్

వరంగల్ రూరల్ : ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను జిల్లా నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పైలాన్ నిర్మించేందుకు ఆదివారం పార్లమెంటు కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ కిషన్, ఇరిగేషన్ సీఈ విజయప్రకాశ్, ఎస్‌ఈ పద్మారావు, ఆర్‌అండ్‌బీ అధికారుల బృందం నగరంలోని పలు స్థలాలను పరిశీలించారు. పబ్లిక్‌గార్డెన్, ఇరిగేషన్ కార్యాలయం, వడ్డేపల్లి చెరువు సమీపంలోని రహదారిపై నిర్మించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మూడు ప్రాంతాల వివరాలు సోమవారం వినయ్‌భాస్కర్, సీఈ విజయప్రకాశ్ ముఖ్యంత్రి కె.చంద్రశేఖరరావు, నీ టి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు వివరించారు. దీం తో సీఎం నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలోనే మిషన్ కాకతీయ పైలాన్ నిర్మించాలని సూచించారు. 8వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పూజ చేసి పైలాన్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది.



 50 అడుగుల ఎత్తులో ‘పైలాన్’



 ‘మిషన్ కాకతీయ’ పైలాన్‌ను 50 అడుగుల ఎత్తుతో నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాకతీయుల సంస్కృతిని ప్రతిబించేలా ఉండాలని సూచించారు. పైలాన్ పైభాగంలో రెండు చేతులు అభ్యర్థించినట్లు ఉండగా పై నుంచి నీటి చుక్క పడే విధంగా అత్యద్భుతంగా నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ పైలాన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా ఆవిష్కరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆమె పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదు.  

 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top