మెట్రో ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌ | Introduce Games Movies In Hyderabad Metro Rail | Sakshi
Sakshi News home page

మెట్రో ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌

Dec 10 2019 8:18 AM | Updated on Dec 10 2019 8:18 AM

Introduce Games Movies In Hyderabad Metro Rail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణ సమయంలో ఎలాంటి వినోదం లేక బోర్‌గా ఫీలవుతున్న వారికి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. విమానాల్లో మాదిరిగా మెట్రో సర్వీసుల్లో నచ్చిన గేమ్‌లు, సినిమాలను వీక్షించే వెసులుబాటు కల్పిస్తోంది. మంగళవారం నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. జీ5 యాప్‌ ద్వారా ఈ సేవలను అందించనున్నారు. ఇందుకు ప్రయాణికులు తమ ఫోన్‌లోని డేటాను వినియోగించాల్సిన అవసరం లేదు. మెట్రో సంస్థనే ప్రత్యేక వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎల్బీనగర్‌ నుంచి లింగంపల్లి, నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీ వరకు ప్రయాణించే ప్రయాణికులంతా ఈ సేవలను పొందవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement