ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని డొంగర్‌గావ్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఆదివారం అదుపు తప్పి లోయలోకి దిగడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి.
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని డొంగర్‌గావ్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఆదివారం అదుపు తప్పి లోయలోకి దిగడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు మైలేజ్ రావడం కోసం ఆర్టీసీ డ్రైవర్ బస్సును న్యూట్రల్ చేయడంతో స్టీరింగ్ లాక్ అయ్యింది. దీంతో బస్సు అదుపు తప్పి లోయలోకి దిగింది. క్షణాల్లో జరిగిన ఈ సంఘటనతో బస్సులో ఉన్న సుమారు 30 మంది ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ ఘటనలో వడూర్‌కు చెందిన కవిత తన కూతురితో కలిసి డ్రైవర్ వెనుక సీటులో కూర్చోగా, బస్సు అద్దాలు పగిలి తలకు గాయమైంది. బస్సులో ఉన్న పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేసినా సంఘటన స్థలా నికి చేరుకోక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.