నల్లగొండ జిల్లాలో గురువారం ఓవర్‌లోడ్ సమస్యతో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది.
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో గురువారం ఓవర్‌లోడ్ సమస్యతో విద్యుత్ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. దీంతో శుక్రవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేవరకొండ మండలంలో ట్రాన్స్‌ఫార్మర్‌లు ఫెయిల్ అవ్వడంతో గురువారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా లేదు. అలాగే చింతపల్లి మండలంలో కూడా ఇదే సమస్యతో ప్రజలు ఇక్కట్లుపుడుతున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి త్వరగా మరమ్మతులు చేపట్టాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.
(దేవరకొండ)