ఏపీలో పనిచేస్తున్న ఆదర్శ రైతులు తమ వివరాలను ఆయా జిల్లాల నాయకులకు అందించాలని ఏపీ ఆదర్శ రైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, ఏడుకొండలు కోరారు.
హైదరాబాద్: ఏపీలో పనిచేస్తున్న ఆదర్శ రైతులు తమ వివరాలను ఆయా జిల్లాల నాయకులకు అందించాలని ఏపీ ఆదర్శ రైతుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, ఏడుకొండలు కోరారు. సీఎం చంద్రబాబు.. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు తెలిపారు.
దీనిలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏపీలో మొత్తం ఎంత మంది ఆదర్శ రైతులున్నారనే విషయాన్ని కోర్టుకు చెప్పడానికి ఆదర్శ రైతులుగా ఉన్న వారంతా ప్రభుత్వం ద్వారా శిక్షణ పొందిన ఆదర్శ రైతు ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులను ఆయా జిల్లాల సంఘం నాయకులకు, లేదా రాష్ట్ర నాయకత్వానికి అందజేయాలన్నారు. వివరాలకు శేఖర్-96527 38915, ఏడుకొండలు- 96032 36302 నంబర్లలో సంప్రదించాలని కోరారు.