'నాకు బతకాలని లేదు' | 'i have to suicide', man wrote a letter and committed suicide | Sakshi
Sakshi News home page

'నాకు బతకాలని లేదు'

Feb 23 2015 6:05 PM | Updated on Sep 2 2017 9:47 PM

నాకు బతకాలని లేదని కుటుంబ సభ్యులకు చెప్పి వాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అదిలాబాద్(దహెగావ్): నాకు బతకాలని లేదని కుటుంబ సభ్యులకు చెప్పి వాగులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దహెగావ్ మండలం అయినం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెల్మల సంతోష్(23) సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్న సంతోష్ సోమవారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నాకు బతకాలని లేదని చనిపోవాలనిపిస్తోందని చెప్పాడు. కాసేపటి తర్వాత బావి వద్ద చూసుకోండి ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టెశాడు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే బావి వద్దకు వచ్చి చూడగా బావికి దగ్గర్లో ఉన్న వాగు గట్టు వద్ద సెల్ ఫోన్‌తో పాటు సంతోష్ బట్టలు, చెప్పులు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సంతోష్‌కు భార్య సునీతతో పాటు కుమారుడు కార్తీక్(3), కుమార్తె కావేరి (నాలుగు నెలల పాప) ఉన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement