నాకు పెళ్లొద్దు..చదువుకుంటా..! | I dont want to marry i want to study | Sakshi
Sakshi News home page

నాకు పెళ్లొద్దు..చదువుకుంటా..!

Apr 23 2016 12:30 AM | Updated on Aug 21 2018 5:54 PM

‘ఇప్పుడే నాకు పెళ్లొద్దు.. ఉన్నతస్థాయి చదువులు పూర్తి చేయాలని ఉంది’ అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది.

నల్లగొండ జిల్లాలో పోలీసులను ఆశ్రయించిన ఓ యువతి

 తిరుమలగిరి: ‘ఇప్పుడే నాకు పెళ్లొద్దు.. ఉన్నతస్థాయి చదువులు పూర్తి చేయాలని ఉంది’ అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం ఈటూరుకు చెందిన బోడ సోమయ్య, అబ్బసాయమ్మ కూతురు లలిత ఈ ఏడాది డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది.

ఇటీవల మండలంలోని మామిడిపల్లికి చెందిన ఓ యువకుడితో లలితకు వివాహం జరిపించాలని తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో లలిత శుక్రవారం తిరుమలగిరి పోలీసులను ఆశ్రయించింది. ఏఎస్‌ఐ లచ్చయ్య యువతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి చదువు పూర్తయిన తరువాత వివాహం జరిపించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement