కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు బానిస బతుకులు తప్పడం లేదని, దాంట్లో బానిసగా బతుకలేనని, అందుకే టీఆర్‌ఎస్ పార్టీలో చేరానని జవహర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ వెల్లడించారు.
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు బానిస బతుకులు తప్పడం లేదని, దాంట్లో బానిసగా బతుకలేనని, అందుకే టీఆర్‌ఎస్ పార్టీలో చేరానని జవహర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ వెల్లడించారు. మల్కాజిగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్ టీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థి మలిపెద్ది సుధీర్‌రెడ్డి సమక్షంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణను నిర్మించేందుకు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షిం చారు. కేసీఆర్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రంగారెడ్డి జిల్లాలోని టీఆర్‌ఎస్ నాయకులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని దీమా వ్యక్తం చేశారు. కుతాడి శ్రీనివాస్‌తోపాటు మరో వెయ్యిమంది కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి ఆలూరి రాజశేఖర్, నక్క ప్రభాకర్‌గౌడ్, విష్ణుగౌడ్‌లతోపాటు జవహర్‌నగర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.